మర్రి ఊడల ఉయ్యాల..పత్తి చేనుకు కావలి!
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం పచ్చని పొలాలు మధ్య ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై ఓ అద్భుత దృశ్యం. మహా మర్రిచెట్టు ఊడలే ఉయ్యాలలుగా మారాయి. వాటిపై కూర్చుని రైతు తన పత్తి చేనుకు కావలి కాస్తున్నాడు. కోతుల బెడద నుంచి పంటను కాపాడేందుకు ప్రకృతినే ఆసరాగా చేసుకున్నాడు. మర్రి ఊడలు నేలను తాకి సహజ ఉయ్యాల ఆకారం సంతరించుకున్నాయి. ప్రయాణికులను ఈ దృశ్యం ఫుల్ ఆకట్టుకుంటోంది. ప్రకృతి అందం, రైతు మమకారం కలిసిన అరుదైన సీన్ ఇది.



