మహిళా నేతపై ఊగిపోయిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్

TG: యాదగిరిగుట్ట పాలకమండలి సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్‌పై తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి బూతు పురాణం ఆడియా తీవ్ర కలకలం రేపింది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా నాన్న ఫోటో ఫ్లెక్సీలో ఎందుకు పెట్టలేదంటూ ఈశ్వరమ్మపై అసభ్యంగా తిట్టారని శివచరణ్ రెడ్డిపై BC సంఘాలు ఫైరవుతున్నాయి. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని బీసీ నాయకులు హెచ్చరించారు. శివశరణ్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



