అదనపు ఎస్పీగా హనుమంతరావుకు పదోన్నతి

పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ఎం.హనుమంతరావుకు అదనపు ఎస్పీగా పదోన్నతి లభించింది. ఆయనకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు GO Rt. No. 1315 విడుదల చేసింది. పదోన్నతి అనంతరం మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా హనుమంతరావుకు పోలీసు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.



