ఇంటర్ పాసైన మాజీ మావోయిస్ట్ దేవ్జీ

TG: ఇటీవల లాసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో సత్తాచాటిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి తాజాగా ఇంటర్లో ఉత్తీర్ణత సాధించారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిరుపతి 1980-82లో కోరుట్లలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ చదివారు. అప్పట్లో RSU (రాడికల్ స్టూడెంట్ యూనియన్)లో చేరారు. ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు పరీక్ష రాయలేకపోయారు. అది మినహా మిగిలిన సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష రాసి 72 మార్కులు సాధించారు. మొత్తం 614 మార్కులతో ఇంటర్ ఉతీర్ణులయ్యారు.



