మమ్ముట్టికి 'పద్మభూషణ్'.. రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు!
మలయాళం సూపర్ స్టార్, ఇండియన్ సినిమా లెజెండ్ మమ్ముట్టి రికార్డ్ క్రియేట్ చేశారు. దేశంలోనే థర్డ్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ‘పద్మభూషణ్’ను ఆయన అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతులమీదుగా మమ్ముట్టి ఈ అవార్డు తీసుకున్నారు. 5 దశాబ్దాల కెరీర్‌లో 400 కి పైగా మూవీస్ చేసి ఆడియన్స్‌ను మెప్పించినందుకు ఈ హానర్ దక్కింది. ఈ స్పెషల్ మూమెంట్‌లో మమ్ముట్టితో పాటు ఆయన వైఫ్, కొడుకు దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు. మమ్ముట్టి కి ఈ ఆనర్ దక్కడం ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

