విజయవాడలో న్యాయవాదుల నిరసన
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఒగ్గు గవాస్కర్, సుభాని, పల్లగాని రవిబాబుపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని నినాదాలు చేశారు. అయితే పోలీసులు నిరసనను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తమపై దాడి చేశారని న్యాయవాదులు ఆరోపించారు. .



