← Back to news

వరంగల్ భద్రకాళి టెంపుల్ వద్ద ఉద్రిక్తత

By డీకే· 3 Jul 2026· వరంగల్ జిల్లా

TG: వరంగల్ జిల్లాలోని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(KUDA) ఆధ్వర్యంలో ఇటీవల ప్లాట్ల వేలం పాటలో దాదాపు రూ.50కోట్ల భారీ అవినీతి జరిగిందంటూ BRS నేతలు ఆరోపించారు. ఆ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తిప్పి కొట్టారు. స్పందించిన KUDA ఛైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి భద్రకాళి గుడిలో ప్రమాణం చేయాలని BRS నాయకులకు సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించిన BRS నేతలు, మాజీ కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు భద్రకాళి ఆలయానికి వస్తుండగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది.

More in Politics