← Back to news

అమెరికా గ్రీన్ కార్డు కావాలా ? అయితే మీ దేశం వెళ్లండి

By aravinda nyayapati· 23 May 2026· X· Washington
అమెరికా గ్రీన్ కార్డు కావాలా ? అయితే మీ దేశం వెళ్లండి

అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్ కార్డు పొందాలనుకునే వారికి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. టూరిస్టులు, స్టూడెంట్స్, టెంపరరీ వర్కర్లు ఎవరైనా గ్రీన్ కార్డ్ కావాలంటే సొంత దేశానికి వెళ్లి అప్లై చేసుకోవాలి. దీనికనుగుణంగా అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ ( USCIS ) మార్పులు చేసింది. ఇప్పటివరకు అమెరికాలోనే ఉంటూ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ (AOS) ద్వారా అంటే అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉండేది.ఇకపై అసాధారణ పరిస్థితుల్లో తప్ప, అందరూ సొంత దేశం నుంచే కన్సులర్ ప్రాసెస్ ద్వారా అప్లై చేయాలని USCIS స్పష్టం చేసింది.

More in Politics