'బ్యాంకులు,ATMల వద్ద భద్రత పెంచాలి'

ఖమ్మం జిల్లాలో బ్యాంకులు, ATMల వద్ద భద్రతా చర్యలను పటిష్ఠం చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఇవాళ పోలీసు, బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ATM వద్ద సెక్యూరిటీ గార్డు,CC కెమెరాలు, అలారం వ్యవస్థ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచాలని, అలారం వ్యవస్థను పోలీస్ స్టేషన్ లేదా కమాండ్ కంట్రోల్కు అనుసంధానించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.



