← Back to news

‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తక రచయిత కన్నుమూత

By Prashanth· 5d ago
‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తక రచయిత కన్నుమూత

‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తక రచయిత వైబీ సత్యనారాయణ 82 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగపల్లి ఆయన స్వస్థలం. ఆయన రచించిన ఈ పుస్తకం నిజాం కాలం నాటి తెలంగాణ గ్రామీణ జీవితం, దళితుల పరిస్థితులు, సామాజిక అసమానతలను వివరిస్తుంది. ‘కబాలి’ సినిమాలో రజనీకాంత్ ఈ పుస్తకాన్ని చదువుతున్నట్లు చూపించడంతో మరింత గుర్తింపు పొందింది.

More in National