ఇది కాలం తెచ్చిన కరువు కాదు :హరీష్ రావు
తెలంగాణలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని BRS నేత హరీశ్ రావు అన్నారు. దేవాదుల ప్రాజెక్టులో పది మోటార్లకు బదులు మూడు మాత్రమే ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నించారు. రిజర్వాయర్లు, చెరువులు నింపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో తక్కువ వర్షపాతం నమోదైనా పంటలు పండుతున్నాయని, తెలంగాణలో మాత్రం రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. “ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు” అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు

