చంద్రబాబు లేఖపై హరీశ్ సంచలన కామెంట్స్!

TG: కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖ తెలంగాణకు మరణశాసనం లాంటిదని BRS లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. గతంలో సమ్మక్క నుంచి నాగార్జునసాగర్కు నీళ్లు తీసుకురావాలని ప్రతిపాదించిన చంద్రబాబు.. ఇప్పుడు పోలవరం నుంచి కావేరికి నీటిని మళ్లించాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. బొల్లెపల్లిలో 150 TMCల నీటిని నిల్వ చేసే ప్రతిపాదనతో ఏపీకి నియంత్రణ పెరిగి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపించారు.
