రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి BJP ఏకైక శత్రువు: నేహా
భారతదేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి BJP ప్రధాన శత్రువుగా మారిందని AISA జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా అన్నారు. ఓటరు హక్కులపై దాడి చేయడం అంటే అది నేరుగా దేశంపై, ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని స్పష్టం చేశారు. CEC జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. SIR ప్రక్రియ అవకతవకలతో ఉందని ఆమె ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, హక్కులను కాపాడుకోవడానికి అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.


