← Back to news

బావిలో ఇద్దరి మృతి.. అసలేం జరిగింది?

By Bala· 11h ago
బావిలో ఇద్దరి మృతి.. అసలేం జరిగింది?

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌లో వ్యవసాయ బావిలో ఇద్దరు అన్నదమ్ముల మృతదేహాలు లభ్యమయ్యాయి. హర్కపూర్‌కు చెందిన రాఠోడ్ అరవింద్ (35), ప్రవీణ్ (32) కూలీ పనులకు వెళ్లి ఈ నెల 11 నుంచి ఇంటికి తిరిగి రాలేదు. నిన్న ఉదయం బావిలో వారి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుమారుల మృతిపై అనుమానాలున్నాయని తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Local