పత్తికొండ కొత్త DSPగా వంశీధర్ బాధ్యతలు

కర్నూలు జిల్లా పత్తికొండ కొత్త DSPగా బాధ్యతలు చేపట్టిన వంశీధర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో SP విక్రాంత్ పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. SP ఛాంబర్‌లో ఆయనకు పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల బదిలీపై వచ్చిన వంశీధర్ పత్తికొండ DSPగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని SP సూచించారు. డివిజన్‌లో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.



