← Back to news

మహిళల భద్రతపై షీ టీమ్ కీలక అవగాహన

By Md Jabeer· 2h ago· Al Faysaliyah, Dammam, Dammam Principality
మహిళల భద్రతపై షీ టీమ్ కీలక అవగాహన

నిర్మల్‌ పట్టణంలోని హరితవనంలో SP జానకి షర్మిల ఆదేశాలతో శుక్రవారం షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ విధులు, ఫిర్యాదుల గోప్యత, సైబర్ నేరాలు, బాల్యవివాహాల నిరోధం, T-Safe యాప్ వినియోగంపై వివరించారు. వేధింపులకు గురైతే భయపడకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం, OTPలు పంచుకోవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని తెలిపారు.

మహిళల భద్రతపై షీ టీమ్ కీలక అవగాహన

More in Local