సొంత ఖర్చుతో గణేష్ మండపం

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకటాపూర్‌కు చెందిన లక్సెట్టిపేట AMC చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా మంచి మనసు చాటుకున్నారు. ప్లాట్స్‌లో ఉండే 80 కుటుంబాల కోసం 50 వేల రూపాయిలతో కొత్త గణేష్ మండప షెడ్డును నిర్మించారు. ఈ సందర్భంగా కాలనీ జనం ఆయనకు శాలువా కప్పి సన్మానించి థాంక్స్ చెప్పారు.


