ఆశా వర్కర్లతో సమానంగా CHWలకు వేతనం ఇవ్వాలి

ఆశా వర్కర్లతో సమానంగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల (CHW) కు నెలకు ₹10 వేల గౌరవ వేతనం చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ సుజాత సల్మాన్ డిమాండ్ చేశారు. అరకులోయలో మాట్లాడిన ఆమె.. ప్రస్తుతం ₹4 వేలే ఇవ్వడం అన్యాయమని, CHWO పోరాటానికి సపోర్ట్ ఇచ్చారు. కలెక్టర్ జోక్యం చేసుకుని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

