ఇసుక అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి: BSP

నారాయణపేటలో ఇసుక అక్రమ రవాణాపై BSP జిల్లా అధ్యక్షుడు బొదిగెలి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. పోలీసు, రెవెన్యూ అధికారుల అండతోనే అక్రమ రవాణా సాగుతోందని ఇవాళ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఇసుక టిప్పర్ యజమానులతో కొందరు అధికారులు కుమ్మక్కై కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.


