E20 ఇథనాల్‌పై ఆగస్టు 4న రవాణాదారుల నిరసన

సీజేపీ నిరసనలకు ఫలితం దక్కిన వేళ..దిల్లీ టాక్సీ, ట్రాన్స్‌పోర్టర్స్, టూర్ ఆపరేటర్ల సంఘాల నిరసనలు మొదలుకానున్నాయి. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 4న పార్లమెంటు వరకు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించాయి. E20 ఇంధనం వల్ల మైలేజీ తగ్గడం, ఇంజిన్ పనితీరు దెబ్బతినడం, మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడంపై వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు పెట్రోల్ ధరలు పెంచుతూ,మరోవైపు ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ఎందుకు ఇస్తున్నారంటూ రవాణాదారులు ఆవేదన చెందుతున్నారు



