← Back to news

రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ

By DK· 1d ago
రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ

TG: ఎల్బీనగర్‌లోని సాగర్ రింగ్‌రోడ్ ఫ్లైఓవర్ కింద ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం బైరామల్‌గూడకు చెందిన ఆలయ చైర్మన్ రేవు రఘు సాయంత్రం ఆలయానికి తాళం వేసి వెళ్లారు. ఉదయం వచ్చేసరికి ఇనుప గ్రిల్స్ గేటు తాళం పగులగొట్టి కనిపించింది. లోపల హుండీని ధ్వంసం చేసి నగదు అపహరించినట్లు గుర్తించారు. 4 గ్రాముల బంగారు పుస్తెలు, 5 గ్రాముల బంగారు ముక్కుపుడక కనిపించకుండా పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Local