రోహిత్‌కు వరల్డ్‌కప్ లైన్ క్లియర్.. ఫిట్‌నెస్ టెన్షన్!

వచ్చే వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడటంపై టెన్షన్ కొనసాగుతోంది. అజిత్ అగార్కర్ సెలక్షన్ కమిటీ నుంచి తప్పుకోనున్న కారణంగా రోహిత్‌ని కొనసాగించడానికి అడ్డంకులు తగ్గినట్లు కనిపిస్తున్నా.. అతని ఫిట్‌నెస్‌పైనే BCCI ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 39 ఏళ్ల రోహిత్ లాస్ట్ IPLలో గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రపంచకప్ వరకూ ఫిట్‌గా ఉంటానని నిరూపించుకోవాల్సి ఉండగా.. ఆల్టర్నేటివ్‌గా యశస్వి జైస్వాల్‌ను రెడీ చెయ్యాలనే సూచనలు వినిపిస్తున్నాయి.



