తరంగ్-II పర్వతాన్ని తొలిసారి ఎక్కిన ఇండియన్స్

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం లాహౌల్-స్పితి జిల్లా మియార్ వ్యాలీలోని 6,027 మీటర్ల ఎత్తైన తరంగ్-II (షైలపుత్రి) పర్వతాన్ని తొలిసారి భారతీయులు ఎక్కారు. Transcend Adventures అనే సంస్థకు చెందిన పదిమంది సెప్టెంబర్ 11న బయలుదేరి సెప్టెంబర్ 22 మధ్యాహ్నం పర్వతంపైకి చేరుకున్నారు. 2016లో బ్రిటిష్, స్వీడిష్ క్లైంబర్లు ఈ పర్వతం ఎక్కారు. భారతీయులు ఈ పర్వతాన్ని ఎక్కడం ఇదే తొలిసారి. నైరుతి ముఖం మధ్య భాగం నుంచి పైకి వెళ్లి, పశ్చిమ రిడ్జ్ ద్వారా పైకి చేరుకున్నారు.


