← Back to news

ప్లాస్టిక్ ఇస్తే సరుకులు.. రెస్పాన్స్ అదుర్స్

By Prashanth· 7h ago
ప్లాస్టిక్ ఇస్తే సరుకులు.. రెస్పాన్స్ అదుర్స్

AP: రాష్ట్రంలో గ్రామాల పరిశుభ్రత కోసం చేపట్టిన ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. సెప్టెంబరులో రాష్ట్రవ్యాప్తంగా 34 లక్షల 83 వేల కిలోల పొడిచెత్త సేకరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను స్వచ్ఛ రథానికి అందిస్తే.. వాటి బరువుకు సమాన విలువైన నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఈ కార్యక్రమానికి ఆదరణ పెరుగుతోంది. కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు, కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలాల్లో గణనీయంగా పొడిచెత్త సేకరించారు.

More in AP