శ్రీ అన్నపూర్ణాదేవిగా అఖిలాండేశ్వరి అమ్మవారు

గుంటూరు జిల్లా మంగళగిరి స్టేషన్ రోడ్డులోని శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. అమ్మవారికి కుంకుమార్చనలు, సామూహిక లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.


