← Back to news

రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

By epuri rajaratnam· 1d ago· Tadikonda, Tadikonda, Guntur
రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో పొన్నెకల్లు నుంచి గరికపాడు వరకు ₹.2.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామాల మధ్య రాకపోకలు సులభతరమై, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

More in Local