కేతేపల్లిలో BRS లీడర్ ఇంట తీవ్ర విషాదం

వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి BRS లీడర్ మీనిగ శ్రీనివాస్ నాయుడు కొడుకు 25 ఏళ్ల సురేందర్ నాయుడు అనారోగ్యంతో చనిపోయాడు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూశాడు. కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. లోకల్స్, BRS లీడర్లు సంతాపం తెలిపారు.



