← Back to news

జిమ్‌లో వ్యాయామం చేస్తూ..హఠాత్తుగా మృతి

By Vishi· 6h ago

రాజస్థాన్‌లోని చురూ జిల్లా సర్దార్‌షహర్‌లోని ఒక జిమ్‌లో విషాదం జరిగింది. ఓ ఫిట్‌నెస్ జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తుండగా 49 ఏళ్ల ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయారు. చుట్టూ ఉన్నవారు వెంటనే హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. జిమ్ చేసే టైంలో జాగ్రత్తలు అవసరం అని, డాక్టర్ల సలహా లేకుండా ఎక్కువసేపు వ్యాయామం చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More in National