← Back to news

నాయకుల ఎంపికలో 'Peaceful Revolution' రావాలి: వాంగ్‌చుక్

By Mahesh· 14 Aug 2026· X

2047 నాటికి ఇండియా గౌరవప్రదమైన దేశంగా ఉండాలంటే నాయకుల ఎంపిక విధానంలో 'Peaceful Revolution' రావాలని సైంటిస్ట్, యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. దేశంలోని సగం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉండగా, ఇంకొంత మందిపై మర్డర్, రేప్, కిడ్నాప్ వంటి ఆరోపణలు ఉన్నాయన్నారు. దేశంలో నమ్మకం లోపం పెరిగిందన్న ఆయన.. నిస్వార్థ, నిర్భయ, సమర్థులైన వ్యక్తులతో చర్చించి మార్పులకు మార్గం రూపొందించాలని అన్నారు. “TOGETHER CAN WE START INDIA'S 2ND INDIPENDENCE MOVEMENT!” అని పిలుపునిచ్చారు.