జిల్లా కబడ్డీ ఎంపికల్లో సత్తా చాటిన క్రీడాకారులు

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండలో జిల్లా కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించగా 300 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు, బాలికలు, సబ్‌జూనియర్ బాలికల జట్లకు ఎంపికలు చేపట్టారు. జిల్లాలోని 20 మండలాల నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ప్రతిభ ఆధారంగా జిల్లా జట్లను ఎంపిక చేశారు. జూనియర్ బాలురు, సబ్‌జూనియర్ బాలికల జట్లు ఈ నెల 26 నుంచి 29 వరకు సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్యగౌడ్ తెలిపారు.



