రాపిడోకు రూ.10 లక్షల జరిమానా

రైడ్ బుక్ చేసుకునే టైంలో కస్టమర్లతో ఎక్కువ డబ్బు చెల్లించేలా ఒత్తిడి చేసే విధానాలను ఉపయోగించిందని CCPA గుర్తించింది. రూ.60కి డ్రైవర్ అంగీకరించడం లేదని, మరో రూ.10, రూ.20 లేదా రూ.30 చెల్లిస్తే రైడ్ త్వరగా దొరికే అవకాశం ఉందంటూ యాప్‌లో మెసేజ్‌లు చూపించడంపై అబ్జెక్షన్ తెలిపింది. ఎక్కువ ధర ఎంచుకునేలా యాప్ డిజైన్ చేయడం, రైడ్ ప్రారంభానికి ముందే టిప్ అడగడాన్ని తప్పు పడుతూ రాపిడో సంస్థకు రూ.10 లక్షల ఫైన్ విధించింది.


