← Back to news

మిడ్జిల్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు

By B.SV· 1d ago· Midjil, Midjil, Mahabubnagar
మిడ్జిల్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దసరా పండుగలో భాగంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలు నిర్వహించారు. 40 మహిళా గ్రూప్స్ సభ్యులు పాల్గొన్నారు. 1,000 మందికి పైగా చిన్నారులు ఒకే వేదికపై సందడి చేశారు. మహిళలు జానపద గీతాలు పాడుతూ, చప్పట్లు కొడుతూ, కోలాటాలతో ఆడిపాడారు. మహిళల కోసం బతుకమ్మ తయారీ, ఆటపాటల పోటీలు ప్రత్యేకంగా నిర్వహించారు.

More in Local