చెన్నై ట్రాఫిక్ పోలీసులకు CSK 63 బైక్‌లు గిఫ్ట్!
IPL టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సిటీ ట్రాఫిక్ పోలీసులకు రూ.కోటి విలువైన 63 బైక్‌లను గిఫ్ట్‌గా ఇచ్చింది. అక్టోబర్ 12న వెపెరిలోని పోలీస్ కమిషనరేట్‌లో కమిషనర్ అమల్‌రాజ్ వీటిని అందజేశారు. వీటిలో 38 హోండా షైన్, 25 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు ఉన్నాయి. CSK తన CSR కార్యక్రమంలో భాగంగా ఈ వాహనాలను అందించింది. ట్రాఫిక్‌ను తగ్గించడం, పెట్రోలింగ్‌ను పెంచడం, రూల్స్ బ్రేక్ చేయడాన్ని అరికట్టడం ఈ గిఫ్ట్ ప్రధాన లక్ష్యమని CSK తెలిపింది.


