మంత్రి పొంగులేటి చొరవ.. బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండా వరద బాధితులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. రెండేళ్ల క్రితం వరదల్లో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు భవిష్యత్తులో మళ్లీ ఇబ్బందులు ఎదురుకాకుండా కేశవాపురం గ్రామపంచాయతీ పరిధిలో పునరావాసం కల్పించారు. బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అజ్మీర తండా సర్పంచ్ నీలిమ బాలాజీ ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణాల కోసం ముగ్గులు పోశారు. త్వరలో మంత్రి పొంగులేటి ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు.


