← Back to news

మళ్లీ వర్షాలు.. బండరాళ్ల బీభత్సం!

By Lokesh· 3h ago

సిక్కింలోని రింబి గ్రామంలో భారీ వర్షాలతో సెప్టెంబర్ 24 రాత్రి మళ్లీ పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి బురద, రాళ్లు గ్రామంలోకి కొట్టుకురావడంతో 30కి పైగా ఇళ్లు, కొన్ని ప్రభుత్వ క్వార్టర్స్ దెబ్బతిన్నాయి. అయితే ప్రాణనష్టం జరగలేదు. అంతకుముందే వర్షాల ముప్పును గుర్తించిన అధికారులు.. సెప్టెంబర్ 17కి ముందు 128 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ప్రస్తుతం వర్షాలు కొనసాగుతుండటంతో ఇళ్లు, రోడ్లకు డేంజర్ అలర్ట్ ఉంది.

More in National