యష్ 'టాక్సిక్' ఈవెంట్‌లో కుప్పకూలిన సౌండ్ సెటప్!
హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి యూనివర్సిటీలో జరిగిన హీరో యష్ 'టాక్సిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం జరిగింది. ఈవెంట్‌కు భారీగా స్టూడెంట్స్, ఫ్యాన్స్ తరలిరావడంతో క్రౌడ్ ఎక్కువైంది. స్పీకర్లు, ఈవెంట్ ఎక్విప్‌మెంట్ ఉన్న స్ట్రక్చర్‌పైకి కొందరు ఎక్కడంతో సౌండ్ సిస్టమ్, లైటింగ్ సెటప్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు స్టూడెంట్స్‌కి గాయాలవ్వగా, ఒక యువతి స్పృహ తప్పిపడిపోవడంతో వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. స్టేజ్ పై మాట్లాడేటప్పుడు ఇది గమనించిన యష్ స్పీచ్ వెంటనే ఆపేశారు.



