← Back to news

NSUI కార్యకర్త అతిర విజయన్ కంప్లైంట్‌పై కేరళంలో Zero FIR

By Vishi· 2h ago
NSUI కార్యకర్త అతిర విజయన్ కంప్లైంట్‌పై కేరళంలో Zero FIR

ఢిల్లీలో ఎన్నికల కమిషనర్ కార్యాలయం ముట్టడి టైంలో పోలీసుల దౌర్జన్యానికి, దాడికి గురైన మలయాళీ విద్యార్థిని, NSUI కార్యకర్త అతిర విజయన్ కంప్లైంట్‌తో కేరళంలోని తిరువల్లూర మ్యూజియం పోలీస్ స్టేషన్‌లో Zero FIR నమోదైంది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిరసనలో తనను, తోటి కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు బస్సులోనూ, బయటా విచక్షణారహితంగా కొట్టారని ఆమె తన కంప్లైంట్‌లో రాశారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వివరించారు.

More in Politics