← Back to news

EC నియామక చట్టం కేసు CJIకి.. ఎందుకంటే?

By Anusha· 1d ago· Indianexpress
EC నియామక చట్టం కేసు CJIకి.. ఎందుకంటే?

2023లో కేంద్రం తీసుకొచ్చిన EC నియామక చట్టంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం జరిగింది. ఈ చట్టంలో ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ నుంచి CJIని తొలగించి, ప్రధాని నామినేట్ చేసే కేంద్ర మంత్రిని చేర్చారు. దీనిపై దాఖలైన పిటిషన్లలో ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. జస్టిస్‌ శర్మ రాజ్యాంగ ధర్మాసనం అవసరమన్నారు. జస్టిస్‌ దత్తా మాత్రం ప్రస్తుత బెంచ్‌ కేసును తేల్చవచ్చన్నారు. దీంతో కేసును CJIకి పంపారు. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలా, లేదా అనేది CJI నిర్ణయించనున్నారు.

More in National