ఆసియా కప్ ట్రోఫీని తీసుకోని భారత జట్టు.. మళ్లీ అదే సీన్!

ఆసియా కప్ ట్రోఫీని తీసుకునే విషయంలో భారత జట్టు గతేడాది తీసుకున్న డెసిషనే తీసుకుంది. 2026 మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ACC అధ్యక్షుడు ‘మోహ్సిన్ నఖ్వీ’ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోలేదు. మ్యాచ్ తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా జట్టుతో మాట్లాడారు. అనంతరం భారత ఆటగాళ్లు మైదానంలోకి రాకుండానే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. దీంతో నఖ్వీ ట్రోఫీ అందజేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2025 పురుషుల ఆసియా కప్‌లోనూ భారత జట్టు నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోలేదు.



