← Back to news

MLA క్యాంపు కార్యాలయంలో దసరా వేడుకలు

By Yadla Venudhar· 1h ago· Suryapet

సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కుటుంబసమేతంగా ఆయుధ పూజలు, వాహన పూజలు నిర్వహించారు. పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాలువలు, బొకేలు అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జేజే నగర్‌లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

More in Local