రాజరాజేశ్వర స్వామి ఆలయానికి విరాళం

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి భూదేవి హిల్స్లో ఉన్న రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డి. అనిల్ రెడ్డి సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అభివృద్ధి కోసం ₹.50,000 చెక్కును ఆలయ కమిటీ అధ్యక్షుడు యాదగిరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, మల్లేష్ గౌడ్, రమేష్, ఎడ్ల సత్యనారాయణ, పి. శ్రీనివాస్ యాదవ్, సాయిబాబా, అమరేందర్ రెడ్డి, సుమన్, ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.



