మందమర్రిలో డేంజర్ గా మారిన రోడ్డు

TG : మంచిర్యాల జిల్లా మందమర్రి 1st జోన్ గ్యాస్ గోదాం ఆపోజిట్ లైన్‌లో రోడ్డు ఘోరంగా తయారైంది. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు, పగుళ్లు, పగిలిన డ్రైనేజీ కాలువలతో చాలా డేంజర్‌గా మారింది. దీనివల్ల స్కూల్ పిల్లలు, సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నైట్ టైమ్‌లో రోడ్డు సరిగ్గా కనిపించక చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ప్రజల సేఫ్టీ కోసం అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డుకి రిపేర్లు చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



