కేసులు క్లియర్ కావడానికి 21 ఏళ్లా?

వెస్ట్ బెంగాల్ ఉపఎన్నికల్లో 19 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన అప్పీలేట్ ట్రిబ్యునళ్లలో ముగ్గురు జడ్జిలు రిజైన్ చేయడంతో విచారణ స్లో అయింది. పెండింగ్‌లో ఉన్న 38.31 లక్షల అప్పీళ్లలో ఇప్పటివరకు కేవలం 3% (1.26 లక్షలు) మాత్రమే క్లియర్ అయ్యాయి. ఈ స్పీడ్ చూస్తే కేసులు తేలడానికి 21 ఏళ్లు పడుతుందని కలకత్తా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీంతో నందిగ్రామ్, రెజినగర్ ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉండాల్సి వస్తోంది.

