నేరాల వెనక అసలు కారణాలు తేల్చితేనే కట్టడి: DGP

TG: నేరాల నియంత్రణకు వాటి మూల కారణాలను గుర్తించి పరిష్కరించడమే కీలకమని DGP CV ఆనంద్ అన్నారు. హైదరాబాద్‌లోని DGP కార్యాలయంలో నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నేర సమీక్షలు కేవలం గణాంకాల పరిశీలనకే పరిమితం కాకుండా ప్రతి నేరం వెనుక ఉన్న కారణాలు, నేరస్థుల విధానం, దర్యాప్తు తీరును లోతుగా విశ్లేషించాలని సూచించారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో నేరాల సంఖ్య పెరిగినప్పటికీ తీవ్ర నేరాలు, సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల నమోదైందని తెలిపారు.



