← Back to news

దల్లాపల్లిలో పర్యాటక అభివృద్ధికి కొత్త అడుగు

By B V Appalanaidu· 1d ago· Dallapalle, Paderu, Alluri Sitharama Raju
దల్లాపల్లిలో పర్యాటక అభివృద్ధికి కొత్త అడుగు

అల్లూరి జిల్లా పాడేరు మండలం దల్లాపల్లిలో పర్యాటక కాటేజీల నిర్మాణ ప్రాజెక్టుకు అధికారులు భూమిపూజ చేశారు. APTDC, SHG, స్థానిక యువత సంయుక్తాధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, జిల్లా పర్యాటక అధికారి చలపతిరావు పాల్గొన్నారు. ప్రకృతిని కాపాడుతూ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి సంస్కృతి, సంప్రదాయాలను మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు.

More in Local