ఎడారి కరువును తట్టుకుని నిలబడ్డ గాడిదలు

1982లో ఇజ్రాయెల్ నెగేవ్ ఎడారిలోని రామన్ క్రేటర్‌లో 28 అడవి గాడిదలను వదిలింది. ఒకప్పుడు ఇక్కడున్న ఈ జాతి వేట వల్ల అంతరించిపోయింది. ఇప్పుడు వాటి సంఖ్య 500-600కు పెరిగింది. కరువు టైంలో ఇవి గిట్టలతో ఇసుక తవ్వి రెండు మీటర్ల లోతు నీటి గుంతలు తవ్వుతాయి. నక్కలు, జింకలకు కూడా నీళ్లు అందిస్తాయి. అకేషియా విత్తనాలు తిని వ్యర్థాల ద్వారా వ్యాప్తి చేస్తూ కొత్త చెట్లు పెరగడానికి సహాయపడతాయి. వాటి అడుగుల వల్ల ఇసుకలో నీరు నిలుస్తుంది.



