← Back to news

తాగునీటి సమస్యపై ప్రజల ఆందోళన

By Bala· 13h ago
తాగునీటి సమస్యపై ప్రజల ఆందోళన

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎన్.గొల్లపల్లి SC కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానికులు ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన చేపట్టారు. CITU, కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వారికి మద్దతు తెలిపారు. సాగర్ నీటి పైప్‌లైన్ సమీపంలో ఉన్నా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదన్నారు.

More in Local