కొడుకులా? కూతుళ్లా? పేరెంట్స్ హ్యాపీ ఎవరితో?

కొడుకుల కంటే కూతుళ్లే పేరెంట్స్‌ను ఎక్కువ సంతోషపెడతారా? చైనాలో జరిగిన తాజా అధ్యయనం ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది. 2012–2021 మధ్య 49,752 మంది వివరాలను పరిశీలించగా.. కొడుకులు ఉన్నవారితో పోలిస్తే కూతుళ్లు ఉన్న తల్లిదండ్రులు ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఇద్దరు కూతుళ్లు ఉన్నవారిలో ఈ తేడా ఎక్కువగా కనిపించింది. అయితే కూతుళ్లు ఉండటమే సంతోషానికి కారణమని అధ్యయనం నిరూపించలేదు.



