పెదవడ్లపూడిలో గాంధీ జయంతి సెలబ్రేషన్స్

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో యోగా మిత్ర బృందం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, గ్రామ ప్రముఖులు, యోగా సాధకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ ఆశయాలను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని చంద్రశేఖర్ సూచించారు. అనంతరం యోగాలో ప్రతిభ కనబరిచిన బాలయోగ సాధకురాలు గోమిని సాయిని సత్కరించి నగదు బహుమతి అందజేశారు.

