ఎల్‌నినో ఎఫెక్ట్..40% తగ్గిన దిగుబడి

AP: కుప్పం పూల మార్కెట్‌పై ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపుతుంది. మార్చి నుంచి కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలతో పూలు ముందుగానే వాడిపోతున్నాయి. పూలు పూసే టైం నాలుగు వారాలు ఆలస్యమైంది. పూల పరిమాణం, బరువు, నాణ్యత కూడా తగ్గాయి. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 18 వరకు కుప్పంలో సాధారణ వర్షపాతం 400.1 మి.మీ. కాగా, కేవలం 100.8 మి.మీ. వర్షమే కురిసింది. ఈ ఏడాది పూల దిగుబడి కనీసం 40 శాతం తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.


